ADVT
స్పార్క్‌ ప్లగ్‌ జాగ్రత్త!
02-01-2018 23:33:30
టూవీలర్లు నడిపేవారు తమ బండి స్పార్క్‌ ప్లగ్‌ పనితీరును తరచూ పరీక్షిస్తుండాలి. దీనివల్ల ఇంజిన్‌ కండిషన్‌ను సులువుగా తెలుసుకోవచ్చు. స్పార్క్‌ ప్లగ్‌ను అంటిపెట్టుకొని ఉండే దుమ్మును తరచూ తొలగిస్తుండాలి. దీనివల్ల స్పార్క్‌ ప్లగ్‌ పనితీరు మెరుగవటమే కాక మన్నిక పెరుగవుతుంది.
  • ‘స్పార్క్‌ప్లగ్‌ రెంచి’ ని ఉపయోగించి బయటకు తీయండి. మూతను జాగ్రత్తగా తొలగించండి.
  • ప్లగ్‌ చుట్టూ పొగచూరిన మసి, దుమ్ము, ఆయిల్‌ అవశేషాలను శుభ్రమైన గుడ్డతో తుడవండి. దాంతోపాటు స్పార్క్‌ప్లగ్స్‌ కండీషన్‌ను ఓ సారి పరిశీలించండి. నల్లటి మసి పేరుకుపోతే స్పార్క్‌ప్లగ్‌ సరైన కండిషన్‌లో లేదని అర్థం.
  • ప్లగ్‌ను పెట్రోల్‌ లేదంటే కిరోసిన్‌లో వేయాలి. కొంచెం సేపు ఉంచి బయటకు తీసి శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి.
  • మాన్యువల్‌లో సూచించిన విధంగా ఎలక్ర్టోడ్‌ల మధ్య తగినంత ఎడం ఉండే లా అమర్చండి. సాధారణంగా ఈ ఎడం 0.8 మి. మీ. -1.2 మి. మీ.
  • తిరిగి ‘స్పార్క్‌ప్లగ్‌ రెంచి’ని ఉపయో గించి జాగ్రత్తగా యథాస్థానంలో బిగించండి. మరీ బిగుతుగా బిగించితే స్పార్క్‌ప్లగ్‌ థ్రెడ్‌ పాడవటమే కాక పనితీరు దెబ్బతింటుంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.