శాంసంగ్ ఆన్ నెక్ట్స్ వచ్చేస్తోంది.. రూ.1000 ఆఫర్‌తో..
01-01-2018 18:30:22
న్యూఢిల్లీ: ‘ఆన్’ సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ సరికొత్త మొబైల్‌తో మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఈనెల 3న ‘గెలాక్సీ ఆన్ నెక్ట్స్’ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని అసలు ధర రూ.10,999 కాగా, లాంచింగ్ ఆఫర్ కింద మొబైల్స్ బొనాంజా సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ రూ.1000 రాయితీ అందిస్తోంది.
 
స్పెసిఫికేషన్లు: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఓఎస్, 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా ద్వారా ఫుల్ హెచ్‌డీ వీడియోలను 30 ఎఫ్‌పీఎస్ ఫ్రేమ్ రేట్‌లో రికార్డు చేసుకునే సదుపాయం ఉంది. అవసరం మేరకు అంతర్గత మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. 3,300 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఉపయోగించిన ఈ ఫోన్ బరువు 167 గ్రాములు మాత్రమే.
 
ఆన్ నెక్ట్స్ సిరీస్‌ను శాంసంగ్ గతేడాది అక్టోబరులో ప్రారంభించింది. 32 జీబీ వేరియంట్‌ను రూ.18,490 ధరతో విడుదల చేసింది. ఇప్పుడు బడ్జెట్ ధరలో 16జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Tags : Samsung, Smartphone
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.