ADVT
స్మార్ట్‌ యూత్!
01-01-2018 14:07:17
  •  నయా స్మార్ట్‌ ఫోన్‌లపై యువత ఆసక్తి
  •  ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్‌లపై మోజు
  •  మార్కెట్‌లో నూతన మోడల్‌ ఫోన్లు
 
 
స్మార్ట్‌ఫోన్‌లపై యువతలో రోజురోజుకూ క్రేజ్‌ పెరిగిపోతోంది. మార్కెట్‌లోకి ఏ కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చినా అది యువత చేతుల్లోకి వెళ్లిపోతోంది. రానురాను యువతకు వ్యామో హంగా మారిపోతుంది. సెల్‌ఫోన్‌ లేకపోవ డాన్ని నేటి యువత నామూషిగా ఫీలవుతు న్నారంటే స్మార్ట్‌ఫోన్‌లు నేడు యువత జీవి తంలో భాగస్వామ్యం అయిపోయాయి. కొత్త ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్‌ బాగా ఉం ది. పాత మోడల్‌ ఫోన్‌లను నేటి యువత ముట్టుకోవడంలేదు. సెల్‌ఫోన్‌ ప్రస్తుతం ప్ర తీ ఒక్కరి జీవితంలో భాగమైపోతే ఖరీదై న ఫోన్‌లు మాత్రం యువతకు స్టేటస్‌ సింబల్‌గా మారాయి. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ లపై జరిపిన సర్వేలో యువత వాడుతున్న ఖరీదైన ఫోన్‌లలో 15శాతం కూడా వారి తల్లిదండ్రులు వాడడం లేదని తేలింది. చిన్న నుంచి పెద్ద వరకు వ యస్సుతో సంబంధం లే కుండా ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్‌లే క నబడుతున్నాయి. నేటి యువత అభిరుచికి అను గుణంగా కంపెనీలు సైతం నిత్యం ఏదో ఒక మోడల్‌ మార్కె ట్‌లో విడుదల చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మొబైల్‌ కంపెనీల మధ్య పో టి పెరిగి స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కొంత తగ్గ డంతో వీటి అమ్మకాలు పెరిగాయి. మొబైల్‌ కంపెనీలుసైతం వాటి ఉనికిని కాపాడుకునేం దుకు కొత్తకొత్త ఫిచర్లతో యువతను కట్టిప డేస్తున్నాయి.
 
ఒకప్పుడు రూ, 5వేల ఫోన్‌నే ఖరీదైన ఫో న్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు రూ. 10వే ల నుంచి 15వేల ఫోన్‌సైతం యువత దృష్టి లో చౌకగా మారింది. రూ. 20వేల నుంచి 50 వేల ధరలు ఉన్న స్మార్‌ ్టఫోన్‌వైపే నేటి యు వత దృష్టిపెడుతున్నారు. వారం రోజుల్లోనే మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు పాతబడి పోతున్నాయంటే నేటి తరం అభిరుచిలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. మార్కె ట్‌లో మాదిరిగానే యువత చేతుల్లో ఆరు నె లలకు మించి ఏ ఫోన్‌ ఉండడంలేదు.
 
ఆపిల్‌ ఐఫోన్‌తో పాటు సామ్‌ సంగ్‌, నోకియా, ఒప్పో, వివో, మైక్రోమ్యాక్స్‌, సోని, హెచ్‌ టీసీ, కార్బన్‌, వీడియోకాన్‌, హాన ర్‌, వన్‌ప్లస్‌5, కంపెనీలు మా ర్కెట్‌లో కొత్తకొత్త ఫోన్‌లను ప్రవేశపెడుతున్నాయి. గత యేడాదిగా ఈ కంపెనీలు సు మారు 172 కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టగా కొం తకాలంగా ఈ సంఖ్య మరిం త పెరిగింది. కొత్త కొత్త ఫీ చర్లు ఉన్న ఫోన్లకు మా ర్కెట్‌లో మంచి ఆదరణ ఉంది.
 
ప్రస్తుతం మొబైల్‌ మార్కెట్‌లో ఆపిల్‌ ఐ ఫోన్‌ ఎక్స్‌, వన్‌ప్లస్‌5టి, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌8, గూగుల్‌ పిక్సల్‌2 ఎక్సెల్‌, హెచ్‌టీసీ యూ11, సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌8, ఎల్‌జి6, సోని ఎక్స్‌పిరియా, లెనోవో, హానర్‌8, మోటో జీ5, రెడ్మీఫోర్‌ లాంటి స్మార్ట్‌ఫోన్‌లు మార్కె ట్‌లో లభిస్తున్నాయి.
 
సెల్ఫీ పిచ్చి..
యువతలో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ ఫోటోలు తీయడం పిచ్చిగా మారింది. మొ బైల్‌ కంపెనీలు సైతం యువత క్రేజ్‌ ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సెల్ఫీ ఫీచర్లు ఉన్న ఫోన్‌లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి.
 
అరచేతిలో ప్రపంచం..
ప్రస్తుతం యువతకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ఇక ఏమి అవసరం లేదు. పర్స్‌లో డబ్బులు లేకున్నా స్మార్ట్‌ఫోన్‌ అందులో బ్యా లెన్స్‌ ఉంటే చాలు ఈ ప్రపంచంలో ఏ దైనా కొనవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే ఆన్‌లైన్‌ షాపింగ్‌, సినిమా, ఫ్లైట్‌ టికెట్స్‌ ఒక్కటేమిటి ఇలా ఎన్నో పనులను స్మార్ట్‌ఫోన్‌ల ద్వా రా చేయవచ్చు. ఇంటి నుంచైనా, ఎక్క డినుంచైనా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా అన్ని ర కాల సేవలను పొందవచ్చు. ప్రస్తు తం ఆన్‌లైన్‌లో సినిమాలు కూడా చే సే అవకాశం ఉండడంతో స్మార్ట్‌ఫోన్‌ల కు యువత బానిసలుగా మారుతు న్నారని నిపుణులు చెబుతు న్నా రు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే మె యిల్స్‌ పంపడం, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటివి యువత స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షిం చడా నికి కారణమవుతున్నాయి.

స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి...
గతంతో పోలిస్తే స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఒకటి రెండు ఆప్షన్లు ఉండే ఫోన్‌లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం కాలానికి అను గుణం గా యువత ఏమి కోరుకుంటున్నారో కంపెనీలు అలాంటి ఫీచర్లతో ఫోన్‌లను మార్కెట్‌ లోకి తెస్తున్నాయి. యాపిల్‌, సాంసంగ్‌, వన్‌ప్లస్‌5, నోకియా, మోటోరొలా, సోని లాంటి కంపెనీలు అనేక రకాల ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నా యి. రూ.25వేల లోపే ఆధునిక ఫీచర్లు ఉన్న ఫోన్లు మార్కె ట్‌లో లభ్యమవుతున్నాయి. 
- మోయిజ్‌, హైటెక్‌ మొబైల్‌ షాపు యజమాని,
                                                                                                    నిజామాబాద్‌ 

స్మార్ట్‌ఫోన్‌ అంటే ఇష్టం..
స్మార్ట్‌ఫోన్‌ అంటే ఇష్టం. ఫోన్‌ ఉంటే చాలు ఏదైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. నెట్‌ సౌకర్యం ఉన్న ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపం చం మనముందున్నట్టే ఉంటుంది. కాలానికి అనుగుణంగా మార్కె ట్‌లో వస్తున్న ప్రతీ ఫోన్‌ గురించి తెలుసుకుంటా. 
- బిట్టు, విద్యార్థి, నిజామాబాద్‌ జిల్లా

 అన్ని పనులు ఫోన్‌తోనే..
ప్రస్తుతం ఇంటర్నెట్‌ అభివృద్ధి చెందిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే అ న్ని పనులు క్షణాల్లో జ రిగిపోతున్నాయి. మూవీ టిక్కెట్స్‌తో పాటు పవర్‌ బిల్‌, బ్యాంకు లావాదేవీల తో పాటు వార్తా సమాచా రాలు ఫోన్‌ ద్వారానే జరుగుతు న్నాయి. మారుతున్న కాలానికి అను గుణంగా స్మార్ట్‌ఫోన్‌లు రోజుకొకటి మార్కెట్‌లోకి వస్తున్నాయి. మార్కెట్‌ లో లభిస్తున్న ఫోన్లు అందుబాటు ధ రల్లో లభించడంతో యువతను బా గా ఆకట్టుకుంటున్నాయి. 
- హరీష్‌, ప్రయివేట్‌ ఉద్యోగి, నిజామాబాద్‌ జిల్లా 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.