ఘనంగా మహా పడిపూజ
19-12-2017 12:41:28
  •  పూజలో పాల్గొన్న నారాయణ పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి
  •  స్వచ్ఛ శబరిమలకుమపాటు పడుదాం
  •  అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా ఉపాధ్యక్షుడు కాకర్ల భీమయ్య
 ధన్వాడ(మహబూబ్‌‌నగర్ జిల్లా): మండల కేంద్రంలో సోమవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజను ఘనం గా నిర్వహించారు. ఉదయం భజనలు చేస్తూ అయ్యప్ప పాటలు పాడుతూ అయ్యప్ప చి త్రపటాన్ని గుర్రం బగ్గిలో ఉంచి పలకీసేవ ని ర్వహించారు. గురుస్వాములు వేణుగోపాల్‌, భీమయ్యగౌడ్‌ కలశంతో ఊరేగింపులో పాల్గొ న్నారు. గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వ హించాక అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద మదనాపూర్‌ గోపాలకృష్ణ స్వామి సారథ్యంలో పడిపూజను నిర్వహించి అన్నదానం చేశా రు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి అయ్యప్పస్వామి పూజల్లో పాల్గొన్నారు. గురు స్వాములు గోపాలకృష్ణ స్వామి, వేణుగోపాల్‌, గోవర్దన్‌ గౌడ్‌, భీమన్న గౌడ్‌, వల్కె ఆనంద్‌, మరికల్‌ అయ్యప్ప, నాయకులు ఉమేష్‌ కు మార్‌, రాంచంద్రయ్య, ఉదయభాను, ఇందిరమ్మ, పటేల్‌ నర్సిములు, మల్లయ్య, మాకం సురెందర్‌, మల్లేష్‌ గౌడ్‌, చంద్రశేఖర్‌, నారాయణస్వామి, అమరేందర్‌ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఆకుల్లో భోజనం అన్నీంటికి శ్రేష్ఠం ..
నారాయణపేట: అరటి, మోదుగాకుల్లో భోజనం చేయడం శ్రేష్ఠమని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచారసమితి జిల్లా ఉపాధ్యక్షు డు కాకర్ల భీమయ్య పేర్కొన్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి పరిశుభ్రతే పరమాత్మ స్వరూ పంగా స్వచ్ఛ శబరిమలకు ఇచ్చిన పిలుపులో అయ్యప్ప స్వాములు భాగస్వాములు కావాల ని సోమవారం ఆయన కోరారు.
 
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన కోయిలకొండ
కోయిలకొండ: మండల కేంద్రంలోని లక్ష్మి నర్సింహ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమ వారం అయ్యప్ప పడిపూజ నిర్వహించగా అయ్యప్ప భజనలతో ఆప్రాంతం మార్మోగింది. స్వామిని పలురకాల పూలతో ప్రత్యేకంగా అ లంకరించారు. స్వాములకు 41రోజుల పాటు అన్నదానం చేస్తున్న నర్సింహాచారి, ఆయన కుమారుడు యాదవ చారిలను అయ్యప్ప సేవా సమితి వారు, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కండువాతో సన్మానించారు. స్వాములందరికి ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపుమేరకు అరటాకుల్లో భోజనాన్ని వడ్డించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.