ADVT
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
18-12-2017 11:26:40
సాంస్కృతికం(ఖమ్మం జిల్లా): నగరంలో మమతా మెడికల్‌కాలేజీ ఎదుట ఏర్పాటుచేసిన శ్రీధర్మశాస్త్ర అన్నదానసేవాసమితి అయ్యప్పస్వామి మండపంలో ఆదివారం మహాపడిపూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, జీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత గరికపాటి వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాపడిన ప్రత్యేకంగాఏర్పాటుచేసిన అయ్యప్పభజనలు చేశారు. ప్రత్యేకంగా గణపతి, అమ్మవారు, వేంకటేశ్వరస్వామి, కుమారస్వాములకు ప్రత్యేకపూజలు జరిపారు.
 
అనంతరం 18మెట్లతో ఏర్పాటుచేసిన మహాపడికి పూజలుచేసి, పడిని వెలిగించారు. కన్యస్వాములు శరణుఘోషను చదువుతూ.. పడిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాన్ని నారాయణ నంబూద్రిస్వామి నిర్వహించారు. గత ఐదేళ్లక్రితం గరికపాటి వెంకటేశ్వరరావు చేతులమీదుగా ఈ ట్రస్ట్‌ పార్రంభమైంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్ష,కార్యదర్శులు మేకల హనుమంతరావుస్వామి, మధుస్వామి, కోశాధికారి పుల్లంరాజు, ఉపాధ్యక్షుడు వసంతకుమార్‌, రమేష్‌, సభ్యులు, అయ్యప్పలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్పస్వాములకు, భక్తులకు అల్పాహారాన్ని అందించారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.