ADVT
‘స్వచ్ఛ శబరిమల’కు కృషి చేస్తాం...అయ్యప్ప స్వాములు
15-12-2017 11:23:00
హైదరాబాద్: పరిశుభ్రతే పరమాత్ముని స్వరూపం అంటూ స్వచ్ఛ శబరిమల కోసం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్ కొత్తపేట వాసవి కన్యకాపరమేశ్వరి స్వామి ఆలయంలో స్వాములు ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ రహిత శబరిమల కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. స్వామి ఆలయంలో ఉపేంద్ర గురుస్వామి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. స్వచ్ఛ శబరిమల కోసం ఏబీఎన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంతో పవిత్రతతో శబరిమల కొండకు చేరుకునే భక్తులు అంతే పవిత్రతతో పరిశుభ్రత పాటించాలని గురుస్వామి పిలుపునిచ్చారు. శబరిమలకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ వస్తువును తీసుకువెళ్లవద్దని కోరారు.
 
అటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అయ్యప్పస్వామి మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. మధురానగర్ బస్తీలో సతీష్‌నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ జరిగింది. అయ్యప్ప భజనలతో మధురానగర్ ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా గురుస్వాములతో పాటు అయ్యప్పలకు సన్మానం జరిగింది. పడిపూజ అనంతరం సతీష్‌నాయర్ గురుస్వామి... భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags : Clean Sabarimala, abn andhrajyothy, CAMPAIGN, Hyderabad

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.