ADVT
ప్లాస్టిక్‌ రహిత ఇరుముడిని కడతాం...
02-12-2017 15:58:15
నిజామాబాద్‌ కల్చరల్‌: మండలంపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షను పాటిస్తున్న అయ్య ప్ప భక్తులు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్పలు దీక్ష చేపట్టేటపుడు ప్లాస్టిక్‌ లేని వస్తువులను ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షలో ప్రతిరోజు చేసే పూజాది కార్యక్రమాల్లో పర్యావరణాన్ని, హాని కలిగించే వస్తువులు ఉపయోగించకుండా జాగ్రత్త పడుతున్నారు. మండలంపాటు వివిధ ప్రదేశాల్లో నిర్వహించే పడిపూజలో పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తూ పూజలను నిర్వహించుకుంటున్నారు. దీక్ష ముగింపులో భక్తిశ్రద్ధలతో తయారుచేసే ఇరుముడిలో సైతం ప్లాస్టిక్‌ రహిత ఇరుముడిని కడతామని అయ్యప్పలు పేర్కోంటున్నారు. వివిధ వస్తువుల నుంచి వచ్చే వాయువులవల్ల పర్యావరణం ఎలా కలుషితం అవుతుందనే విషయాన్ని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అయ్యప్ప పూజలు మొదలుకొని భోజనాల వరకు ప్రతి ఒక్కటి ప్లాస్టిక్‌ రహితంగా ఉన్నవాటినే వినియోగించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
పర్యావరణ పరిరక్షణకు కృషి..
అయ్యప్పలు దీక్ష స్వీకరించింది మొదలుకొని ఇరుముడి వరకు వాతావరణం కలుషితం లేనటువంటి వస్తువులను ఉపయోగిస్తున్నారు. వాతావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్‌ వస్తువులను అ య్యప్పలు వినియోగించడంలేదు. పూజ వస్తువులపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం. భక్తులు పూజ సమయంలో అయ్యప్పను భక్తిశ్రద్ధలతో పూజించాలి. ప్రతీ స్వామి పట్ల గౌరవభావాన్ని చూపుతూ దీక్షను చేయాలి. పూజలో వాతావరణ కాలుష్యాన్ని చేసే వస్తువులు ఉండకుండా చూడాలి. ‘ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌’ ప్లాస్టిక్‌ రహిత అయ్యప్ప పూజకు నడుంకట్టడం అభినందనీయం.
 
- ఎస్‌.జయసింహాగౌడ్‌, నిజామాబాద్‌
Tags : Ayyappa, Temple, Irumudi

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.