శబరిమలకు చేరిన ఏబీఎన్ ‘స్వచ్ఛ’ ప్రచారం
27-11-2017 10:37:12
శబరిమల: పరిశుభ్రతే పరమాత్మ స్వరూపం అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న స్వచ్ఛ ప్రచారం శబరిమలకు చేరింది. ప్లాస్టిక్ రహితంపై అక్కడ వెలసిన ఏబీఎన్ ఫ్లెక్సీలు తెలుగు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అయ్యప్ప కొలువుదీరిన శబరిలో ప్లాస్టిక్ వద్దంటూ ఏబీఎన్ చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
 
అయ్యప్పస్వామి కొలువైన శబరి క్షేత్రాన్ని ప్లాస్టిక్ తదితర కాలుష్య కారకాలతో నింపవద్దంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపు తెలుగు రాష్ట్రాలను దాటి పంబాతీరం చేరింది. స్వచ్ఛ శబరి కోసం ఏబీఎన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్లాస్టిక్ రహితంపై అవగాహన కల్పిస్తున్నాయి. అక్కడ బ్యానర్లను చూసిన తెలుగు భక్తులు ఏబీఎన్ కృషిని అభినందిస్తున్నారు. ఫ్లెక్సీల ముందు నిలబడి అయ్యప్ప క్షేత్రాన్ని స్వచ్చంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏబీఎన్ చేస్తున్న కృషిని అభినందిస్తూ భక్తులు ధన్యవాదాలు తెలిపారు.
 
కేరళ ప్రభుత్వం అయ్యప్ప స్వామి ఆలయంలో ఇప్పటికే స్వచ్ఛ శబరి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అన్ని భాషల్లో భక్తులకు ఆడియో సందేశాలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ శబరికోసం చేయాల్సిన పనులను సందేశాల్లో వివరిస్తున్నారు. స్వచ్ఛ శబరి కోసం ఏబీఎన్ ఎంతో కృషి చేస్తోందని భక్తులు ప్రసంశిస్తున్నారు. ఏబీఎన్ చేపట్టి స్వచ్ఛ శబరి ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అభినందిస్తున్నారు.
 
మరోవైపు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన స్వచ్ఛ శబరిమల ప్రచారానికి అయ్యప్ప భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. పడిపూజల్లోనూ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం లేదు.
Tags : shabarimala, abn andhrajyothi, CAMPAIGN, Ayyappa
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.