జీవితాంతం ప్లాస్టిక్‌ని ఉపయోగించం: ఏబీఎన్‌తో అయ్యప్ప భక్తులు
23-11-2017 11:40:01
వైఎస్సార్ జిల్లా: కడపలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదం, కాలుష్య నివారణ అంశంపై జరిగిన సదస్సుకు అయ్యప్ప భక్తులు భారీగా హాజరయ్యారు. ఏబీఎన్ సంకల్పానికి తాము అండగా ఉంటామని.. ప్లాస్టిక్ నిషేదించడమే కాకుండా జీవితాంతం ఉపయోగించబోమని భక్తులు ప్రమాణం చేశారు. అయ్యప్ప ఆలయం దగ్గర, మున్సిపల్ మైదానంలో చెత్త ఏరివేసి శుభ్రం చేశారు.
 
అనంతపురం జిల్లాలో స్వచ్ఛ శబరిమల పిలుపునకు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి అరటి ఆకులు, పేపర్ వాటర్ గ్లాసులను బిక్ష చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు దూరంగా శబరిమలలోని కొండలను కాపాడుతామని భక్తులు ప్రతిజ్ఞ చేశారు.
 
పరిశుభ్రతే పరమాత్మ స్వరూపం నినాదంతో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. శబరిమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఏబీఎన్‌ వెంట నడుస్తున్నారు అయ్యప్ప భక్తులు, స్వాములు. శబరిమల వెళ్లే భక్తులు, అయ్యప్ప స్వాములు ప్లాస్టిక్‌ తీసుకువెళ్లొద్దని చెబుతున్నారు. హైదరాబాద్‌ బొల్లారంలోని అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు శబరిమలను పరిశుభ్రంగా ఉంచేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
Tags : Ayyappa, Sabarimalai
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.