ADVT
‘స్వచ్ఛ శబరిమల’కు మేము సైతం!
23-11-2017 02:05:41
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నేతృత్వంలో కడప అయ్యప్ప భక్తుల ప్రతిజ్ఞ
కడప, నవంబరు 22: అయ్యప్ప కొలువైన శబరిమలను కాలుష్యం పీడిస్తోంది. భక్తులు తెలిసీ తెలియక వదలి వెళ్తున్న ప్లాస్టిక్‌ వస్తువులు, వ్యర్థాలతో పచ్చని ప్రకృతి నాశనమవుతోంది. ఈ నేపథ్యంలో శబరిమల యాత్ర చేసే అయ్యప్ప భక్తులు స్వచ్ఛ శబరిమలకు నడుం బిగించాలన్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంకల్పానికి అయ్యప్ప భక్తుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. బుధవారం కడపలోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఉన్న అయ్యప్ప దేవాలయంలో కాలుష్య నివారణ, స్వచ్ఛ శబరిమలలో భాగస్వాములమవుతామని అయ్యప్ప భక్తులు ప్రతిజ్ఞ చేశారు. సుదీర్ఘ కాలంగా శబరిమల యాత్ర చేస్తున్న పోతుల వెంకట్రామిరెడ్డి, శేషారెడ్డి, రామకోటిరెడ్డి, అన్నయ్య, గురుస్వామి సీవీ రమణ తదితరులు అయ్యప్ప భక్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మున్సిపల్‌ గ్రౌండ్‌లో ప్లాస్టిక్‌ వస్తువులు, వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు.
Tags : Ayyappa, Sabarimalai

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.