ADVT
పనిని ప్రేమిస్తేనే సంతృప్తి!
17-11-2017 23:32:42
పూర్వం వంగదేశంలో చంద్రయ్య అనే చాకలి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజూ చంద్రయ్య దాని వీపు మీద బట్టల మూటలు వేసుకొని రేవుకు వెళ్లేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి మూటకట్టుకొని తెచ్చి ఇల్లిల్లూ తిరిగి అప్పగించేవాడు.
అయితే ఆ గాడిద ఉన్నదానితో సంతృప్తిపడే రకం కాదు. రోజూ తాను చేసే పనితో విసిగిపోయేది. బట్టల మూటలు మోయటం దానికి ఇష్టం లేదు. ఒక రోజు గాడిద దేవుడిని ప్రార్థించి ‘‘ ఓ దేవుడా నన్ను ఈ పనిలోంచి బయట పడేయి..ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తోంది.ఈ చంద్రయ్య నాచేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు.. నన్ను కాపాడు’ అంటూ ప్రార్థించింది.
 
దేవుడు ప్రత్యక్షమై ‘నాకు నీ మీద జాలి కలుగుతోంది. బరువైన మూటలు మోయకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను సంతోషంగా పనిచేసుకో’ అని వరం ఇచ్చాడు. దాంతో గాడిద ఆనందంగా కుమ్మరి సోమన్న దగ్గరకు వెళ్లింది. కొన్ని రోజుల తరువాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. రోజూ మట్టితొక్కడం, కుండలు మోసుకొని సంతలకోసం ఊరూరా తిరగడం కష్టమనిపించి, మళ్లీ దేవుడికి మొర పెట్టుకొంది. ఈసారి చెప్పులు కుట్టేవాడి దగ్గిర పని ఇప్పించాడు. కానీ గాడిద అక్కడ కూడా సంతోషంగా లేదు.
 
‘నా చేత బరువులు మోయించి మోయించి చంపుతున్నాడు. నేను చచ్చాక నా చర్మంతో చె ప్పులు కుడదామనుకుంటున్నాడు. ఇక్కడా నాకు బాగోలేదు. వేరే పని ఇప్పించు’ దేవుడ్ని ప్రార్థించింది. కానీ దేవుడు కూడా గాడిద పనులతో విసిగిపోయిన దేవుడు ‘నిన్ను ఎవ్వరి దగ్గరకు పంపినా దండగే. నీకు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందు నువ్వు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో..అప్పడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు’ అని గాడిదకు హితవు చె ప్పాడు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.