ADVT
ఏబీఎన్‌ను అభినందిస్తున్న అయ్యప్ప భక్తులు
17-11-2017 12:21:36
విశాఖపట్నం: స్వచ్చ్‌శబరిమల అంటూ....ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపునకు స్మార్ట్ సిటి విశాఖలో మంచి స్పందన వస్తోంది. అయ్యప్ప స్వామి పూజా, దీక్షా కార్యక్రమంలో ప్లాస్టిక్‌ని వినియోగించకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు ప్లాస్టిక్ వినాశనంపై తోటి భక్తులకు అవగాహన కల్పిస్తూ అయ్యప్ప భక్తులు ముందుకు సాగిపోతున్నారు. ప్లాస్టిక్ లేకుండా పూజిద్దాం అంటున్నారు. మంచి కార్యక్రమాన్ని భుజానవేసుకున్న ఏబీఎన్‌ను అభినందిస్తున్నారు.
 
పుణ్యం కోసం దేవుడిని ఆరాధిస్తూ పాపం చేయడం ఎందుకు. ప్లాస్టిక్ రాక్షసులతో దేవతలను పూజించడం ఎందుకు. అందుకు నో ప్లాస్టిక్ అంటూ ఏబీఎన్ ప్రచారం తీసుకుంది. స్వచ్ఛ శబరిమల కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన మహాకార్యాన్ని అయ్యప్ప స్వామి భక్తులు మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. స్వామికి నిర్వహించే అన్ని పూజల్లో సాధ్యమైనంత వరకు పాస్టిక్ గ్లాసులు, ప్లేట్స్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాటి స్థానంలో స్టీల్ గ్లాసులు, సంప్రదాయమైన ఇస్తరాకులను వినియోగించడం మంచిదంటూ అవగాహన కల్పిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో అయ్యప్పస్వామి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడలేదు. స్వామికి అలంకరణ నుంచి దీపారాధన వరకు అన్ని సంప్రదాయ వస్తువులను వినియోగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
 
ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి చెందిన 18 మెట్లు అందంగా అలంకరించడంతో అవి మెరిసిపోయాయి. ఆలయ ప్రాగంణాన్ని అందంగా రంగురంగు పూలతో అలకరించడం, వరుసగా దీపాల ఆలంకరణ, రంగురంగు విద్యుత్ దీపాలు...ఇవన్నీ స్వామి పూజకు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. హరిహర తనయుడుకి సంబంధించిన ప్రత్యేకమైన భక్తి గీతాలు పాడడం, నృత్యాలు చేసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. స్వచ్చ శబమరిమల కోసం, పర్యావరణ హితం కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న కృషిని, చొరవని అయ్యప్పస్వామి భక్తులు మనస్పూర్తిగా అభినందించారు.
Tags : Sabarimalai, CAMPAIGN, abn andhrajyothy, Visakapatnam

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.