ADVT
స్వచ్ఛ శబరిమల... ఏబీఎన్ ఉద్యమానికి విశేష స్పందన
09-11-2017 13:01:26
హైదరాబాద్: భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించటం మన బాధ్యత. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి....శబరిమలను కాలుష్య రహిత దేవస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. శబరిమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఏబీఎన్ చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.
 
కేరళలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడి ఆలయంలో కొలువైన అయప్ప స్వామిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు పవిత్ర మాలధారణతో శబరిగిరి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరిగిపోతుండటంతో శబరిగిరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలుష్యకారక పదార్ధాలతో భక్తులు శబరిమల పవిత్రతను దెబ్బతీస్తున్నారన్న భావనతో దేవస్థాన పరిరక్షణకు పాటుపడేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందుకొచ్చింది.
 
శబరిమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం...అయప్పస్వామి సాక్షిగా శపథం చేద్దాం అనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నినాదానికి మహబూబ్ నగర్ జిల్లా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సభ్యులు మద్దతు ప్రకటించారు. పడి పూజల్లో, నిత్యాన్నదాన సత్రాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. శబరికి తీసుకువెళ్ళే ఇరుముడిలో కూడా ఎలాంటి ప్లాస్టిక్ పదార్ధాలు లేకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా స్వామి దీక్ష చేపడుతున్న తాము పంబ నదిలో, కొండపైన పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయే వాళ్లమని... ఇకపై తామూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్ఫూర్తితో శబరిమలలో ప్లాస్టిక్ వాడబోమని చెప్పారు.
 
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ఈ ఉద్యమంలో ఊరూవాడా చేయీ చేయీ కలుపుతున్నాయి. శబరిమలలోనే కాదు స్థానికంగా తాము చేసే అయ్యప్ప పూజల్లో కూడా ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉంటామని స్వాములు శపథం చేస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ప్లాస్టిక్ రహిత శబరిమల ఉద్యమానికి అయ్యప్ప స్వాములు ఎంతగా ప్రభావితమయ్యారో పూజ దగ్గర పెట్టిన ఈ బ్యానరే సాక్ష్యం. శబరిమలకు ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్లకుండా ఉండటమే కాదు రోజూ చేసే పూజలో కూడా ప్లాస్టిక్ వాడబోమని స్వాములు ప్రతిన బూనారు. పడిపూజ, భిక్ష మెదలైన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువుల్ని వాడటం మానేశారు.
 
అయ్యప్ప స్వామి పూజలోనే కాకుండా స్వామి వారికై ప్రత్యేకంగా కట్టే ఇరుముడిలో సైతం ఎటువంటి ప్లాస్టిక్ సామాగ్రి లేకుండా ఉండేలా జాగ్రత్తలు వహిస్తామన్నారు స్వాములు. తమకు పరిచయం ఉన్న స్వాములందరికీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సందేశాన్ని అందిస్తామన్నారు. కాలుష్యరహిత శబరిమల కోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న కృషి చాలా గొప్పదని కొనియాడిన స్వాములు... ఇక నుంచి తాము ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటామని అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.
Tags : shabarimala, abn andhrajyothy, CAMPAIGN

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.