రైలు ప్రయాణాలకు ఐడీ ప్రూఫ్‌గా 'ఎం-ఆధార్'
13-09-2017 18:13:21
న్యూఢిల్లీ: రిజర్వేషన్ బోగీల్లో రైలు ప్రయాణాలు చేసే వాళ్లు ఇక నుంచి ఐడీ ప్రూఫ్‌‌‌లలో ఒకటిగా 'ఎం-ఆధార్'ను చూపించవచ్చు. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారంనాడు అనుమతించింది. 'ఎం.ఆధార్' అనేది మొబైల్ యాప్. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు తమ ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్న వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. యాప్‌ను ఓపిన్ చేసి పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఆధార్ కార్డును ఐడి ప్రూవ్‌గా చూపించొచ్చు.
Tags : M-AADHAR, RAIL TRAVEL
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.