డీఎంకేతో స్నేహహస్తంపై దినకరన్ ఏమన్నారంటే...
13-09-2017 16:22:13
చెన్నై: ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ బలపరీక్షకు నిలబడాల్సిందేనని డిమాండ్ చేస్తున్న అన్నాడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్, ప్రతిపక్ష డీఎంకేలు చేతులు కలుపనున్నారా? పళని-పన్నీర్ వర్గంతో దినకరన్ తెగతెంపులు చేసుకోనున్నారా? కొద్దికాలంగా వినిపిస్తున్న ఈ ఊహాగానాలపై దినకరన్ పెదవి విప్పారు. డీఎంకేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని కూడా చెప్పారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్‌ను తాను కోరానని, అన్నాడీఎంకే పార్టీని రక్షించుకునేందుకు మడమతిప్పని పోరాటం చేస్తానని చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందంటున్న అన్నాడీఎంకే ఈవీఎస్-ఓపీఎస్ వర్గం దమ్ముంటే తాజా ఎన్నికలకు వెళ్లాలని దినకరన్ సవాలు చేశారు.
Tags : dinakaran