అహ్మదాబాద్ చేరుకున్న జపాన్ ప్రధాని షింజో అబే
13-09-2017 16:02:50
అహ్మదాబాద్ : జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, ఆయన సతీమణి అకీ అబేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు వీరిరువురు వచ్చారు. ప్రధాన మంత్రులిద్దరూ అహ్మదాబాద్ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
 
షింజో అబే దంపతులకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టారు. షింజో అబేకు భారతీయ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. భారతదేశం ఆయనకు ఎర్ర తివాచీ స్వాగతం పలికింది. ఆయన రాక సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
 
ఇండియా - జపాన్ వార్షిక సదస్సులో గురువారం షింజో అబే పాల్గొంటారు. మన దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు షింజో గురువారం శంకుస్థాపన చేస్తారు.
Tags : Shinjo Abe, Akie Abe, Japan, INDIA, Ahmedabad