స్కోడా సరికొత్త కానుక
12-09-2017 23:50:33
చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన కంపెనీ అయినప్పటికీ మనదేశంలో కూడా స్కోడాకు అభిమానులు చాలామందే ఉన్నారు. ఇటీవలే నూతన ఆక్టేవియాను పరిచయం చేసిన ఆ సంస్థ వెంటనే ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 230ను ఆవిష్కరించింది. నిజానికి మోటార్‌స్పోర్ట్‌లో మొట్టమొదటిసారిగా 1974లో ఆర్‌ఎస్‌ పదాన్ని స్కోడా ఉపయోగించింది. యూరప్‌ మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన కథకు అది ఆరంభంగా నిలిచింది. ఇండియాలో ఇప్పుడు విడుదల చేసింది.
 
ఈ మోడల్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర 24,62,542 రూపాయలు. నూతన స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 230లో 2.0 టీఎస్ ఐ టర్బోచార్జ్డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. దీనివల్ల కేవలం 6.8 సెకన్లలో 0-100కిలోమీటర్లు/గంట వేగం అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం 250కిలోమీటర్లు/గంట. లీటరుకు 14.45 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారతదేశంలో స్కోడా ఇప్పటి వరకూ విడుదల చేసిన మోడల్స్‌లో అత్యంత వేగవంతమైన సిరీస్‌ మోడల్‌గా ఇది చరిత్ర సృష్టించింది. అంతేకాదు... స్టాండర్డ్‌ ఆక్టేవియాకు చాలా మార్పులను సంతరించుకున్న మోడల్‌ ఇది. రేస్‌బ్లూ, స్టీల్‌ గ్రే, కోర్రిడా రెడ్‌, కాండీ వైట్‌ కలర్స్‌లో ఇది లభిస్తుంది.
 
ఈ ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 230 యూరోపియన్‌ స్లీపర్‌ సలూన్‌లా ఉంటుంది. బంపర్‌ను బోల్డ్‌ హారిజాంటల్‌ లైన్‌తో డిజైన్‌ చేశారు. ఫాగ్‌ లైట్స్‌, టైల్‌ లైట్స్‌, నెంబర్‌ ప్లేట్‌ ఇల్యూమనేషన్‌ సైతం ఎల్‌ఈడీ టెక్నాలజీతో ఉంటాయి. మెమరీ ఫంక్షన్‌ ఉండటం వల్ల డ్రైవర్‌ సీటును మూడు పొజిషన్స్‌లో గుర్తుంచుకుని అలా ఎలక్ట్రికల్‌గా ఎడ్జస్ట్‌ చేస్తుంది. భారతదేశంలోని ఆక్టేవియా గత మోడల్స్‌తో పోల్చినప్పుడు, స్పోర్ట్స్‌ ఛాసిస్‌, స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్‌ 230 బాడీని 15ఎంఎం తగ్గించింది. స్టాండర్డ్‌ ఆక్టేవియాతో పోలిస్తే ఆర్‌ఎస్‌ 230లో బ్రేక్స్‌ డయామీటర్‌ డిస్క్స్‌ కాస్త పెద్దగా ఉంటాయి. మొత్తంమ్మీద ఫెర్‌ఫార్మెన్స్‌ కారును కోరుకునే వారిని ఇది ఆకట్టుకోవచ్చు.