ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల హాల్‌టికెట్లు
06-09-2017 18:07:58
ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 1.00 గంట వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా తీసుకుని గంట ముందుగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చినవారిని పరీక్షకు అనుమతించరు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్ హైదరాబాద్ సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. ఆన్సర్ షీట్లపై హాల్‌టికెట్ నెంబరు మాత్రమే రాయాల్సి ఉంటుంది. కనుక హాల్ టికెట్ నెంబర్‌ను, పరీక్ష కేంద్రం అడ్రస్‌ను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్ తెలియజేయడం సాధ్యం కాదు. ఆయా కేంద్రాల్లో పరీక్ష రాసే అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ నెంబర్లను దిగువ ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేసి చూడొచ్చు. లింక్‌పై క్లిక్ చేశాక సైడ్ యారో బటన్స్ ద్వారా ఇతర పేజీలకు వెళ్లగలరు.