ఫైండింగ్‌ ద మదర్‌
13-07-2017 23:04:24
 
 ఆది కావ్యం రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే! అందులోని సుందరకాండ మరింత ప్రత్యేకమైనది. రామాయణానికి ఆయువుపట్టు అయిన ‘సుందరకాండ’ను వాల్మీకి మహర్షి ఆవిష్కరించిన తీరు సుందరం. అందుకే ‘సుందరకాండ’ పారాయణకాండ అయింది. ‘సుందరకాండ’లోని శ్లోకాలను యథాతథంగా ఆంగ్లంలోకి కవితా రూపంలోనే అనువదించారు మహతి (మైదవోలు వీఎస్‌ సత్యనారాయణ). ‘ఫైండింగ్‌ ద మదర్‌’ పేరుతో ప్రచురించిన ఈ గ్రంథం సుందరాతి సుందరం.
 
పేజీలు: 358
ధర: రూ.995
 
 
 
 హరే కృష్ణ
నల్లని వాడు, పద్మ నయనాల వాడు, కరుణ రసాన్ని భక్తులపై కురిపించేవాడు.. శ్రీకృష్ణుడు. ఆయన పుట్టుక మాయ, ఆయన లీలలు మాయ.. ఆయన కథలు విన్నా, చదివినా.. మనసున ఆవరించిన మాయ పటాపంచలు అవుతుంది. ఆ కృష్ణలీలలను ఆంగ్లంలో చదివితే ఎంత బాగుంటుంది. అందులోనూ.. వేణుగానలోలుని లీలావిలాసాలను గేయంగా, కవితాత్మకంగా చదువుకుంటే మనసుకు ఎంత హాయి కలుగుతుంది! అలాంటి అనుభూతి పొందాలంటే.. రచయిత మహతి (మైదవోలు వీఎస్‌ సత్యనారాయణ) అందించిన ‘హరే కృష్ణ’ ఆంగ్ల కావ్యాన్ని చదవాలి. వేదవ్యాసుడి ‘భాగవతం’ ఆధారంగా రచించిన ఈ ఆంగ్ల కవితా రూప గ్రంథం కృష్ణ తత్వాన్ని అందంగా ఆవిష్కరించింది.
 
పేజీలు: 402
ధర: రూ. 450
 
రెండు కావ్యాలను కావాలనుకునేవారు 98667 20104 ఫోన్‌ నెంబర్‌ను సంప్రతించగలరు.