జాలర్లపై మళ్లీ విరుచుకుపడిన లంక నావికాదళం
19-06-2017 07:46:45
చెన్నై: జీవనోపాధి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన తమిళ జాలర్లపై మళ్ళీ లంక నావికాదళం విరుచుకుపడింది. సరిహద్దులు దాటారంటూ ఐదుగురు జాలర్లను లంక అధికారులు అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రంలో పెను దుమారానికి దారితీసింది. సరిహద్దులు దాటి చేపల వేటకు వెళ్ళే భారత జాలర్లను అరెస్ట్‌ చేస్తా మని లంక మత్స్యశాఖ మంత్రి గతంలో హెచ్చ రించారు. తమిళ జాలర్లపై విరుచుకుపడే లంక అధికారులకు ఆ శాఖా మంత్రి అదనపు ఉత్తర్వులు జారీ చేయడంతో మ రింత రెచ్చిపోతున్నారు. చేపల కోసం వలలను విసురు తున్న జాలర్లను హద్దులు దాటారని బెదిరించి వారి వస్తువులను ధ్వసం చేయడంతో పాటు పడవలను లంక ప్రభు త్వం స్వాధీనం చేసుకునే ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
 
              ఈ నేపథ్యంలో రామేశ్వ రం, పాంబన్‌, మండపం, కోటైపట్టినం తదితర గ్రామాలకు చెందిన జాలర్లు పాక్‌ జలసంధిలో చేపల వేటకు వెళ్ళేందుకు నిర్ణయించారు. మన్నార్‌ వలైగుడా సముద్రం లో ఫైబర్‌ పడవలో వెళ్ళిన జాలర్లు చేపల వేటకు వలలు విసిరారు. శనివారం అర్ధరాత్రి గస్తీ పడవల్లో అక్కడికి వచ్చిన నావికా దళ అధికారులు హద్దులు దాటారంటూ జాలర్లను హెచ్చరించారు. దీంతో తమిళ జాలర్లు వెంటనే వెనుదిరిగారు. అయితే ఓ పడవ మరమ్మతుకు గురవడంతో అందులో ఉన్న ఐదుగురు జాలర్లను నిర్బంధించి, వారి తీరానికి తీసుకెళ్ళారు. ఐదుగురి ని అరెస్ట్‌ చేసి కాంగేసర్‌ హార్బర్‌కు తరలించారు. అక్కడ జాలర్ల వద్ద విచారణ చేపట్టారు. రామేశ్వరం జాలర్లు దీని గురించి మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ వారిని వెంటనే విడిపిం చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చూపితే ధర్నా చేపడతామని జాలర్లు హెచ్చరించారు.