విమానంలో పుట్టినందుకు బంపర్ ఆఫర్
19-06-2017 07:30:24
న్యూఢిల్లీ: విమానంలో జన్మించిన ఆ శిశువు బంపర్ ఆఫర్ కొట్టేసింది. జీవితాంతం విమానాల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని పుడుతూనే సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఆదివారం ఉదయం సౌదీ అరేబియాలోని డమ్మర్ నుంచి కొచ్చికి బయలు దేరింది. విమానం ప్రయాణిస్తుండగా, ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. విమానంలోనే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో జట్ ఎయిర్‌వేస్... అప్పుడే పుట్టిన శిశువుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇలా విమానంలో శిశువు జన్మించడం ఇదే తొలిసారి. దీంతో ఆ శిశువుకు జీవితాంతం తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించాలని జెట్ ఎయిర్‌వేస్ నిర్ణయించింది. ఈ ఆఫర్ లభించినందుకు ఆ శిశువు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.