‘జోనల్‌ వ్యవస్థను రద్దు చేస్తే ఉద్యమిస్తాం’
19-06-2017 07:14:30
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో జోనల్‌ వ్యవస్థ రద్దు చే యాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించడాన్ని ఆయన ఖండించారు. జిల్లా, జోనల్‌, స్టేట్‌ కేడర్‌గా మూడెంచల వ్యవస్థ ఉమ్మడి జిల్లాకు కవచంగా ఉందని, ఈ వ్యవస్థను రద్దు చేసి రెండచెల వ్యవస్థగా మార్చాల నిర్ణయం వెనక్కీ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు వెనుకబడతాయన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డిని కలుపు కొని ప్రత్యేక జోనల్‌గా ఏర్పాటు చేయాలన్నారు. జోనల్‌ వ్యవస్థను రద్దు చేస్తే ఉద్యోగ, ప్రజా సంఘాలను కలుపుకొ ని ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.