నటుడు వెంకట్ ఆత్మహత్యాయత్నం
19-06-2017 07:05:46
బెంగళూరు: ఓ సినీనటిని ప్రేమించిన నటుడు వెంకట్ తన ప్రేమ విఫలం కావడంతో తన నివాసంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... ప్రముఖ కన్నడ నటుడు హుచ్చ వెంకట్ తన ప్రేమ విఫలమైందంటూ ఆదివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వెంకట్... స్నేహితులపై విరుచుకుపడ్డాడు. చికిత్స అందిస్తున్న వైద్యులపైనా చిర్రుబుర్రులాడాడు. కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఒక నటిని... వెంకట్ ప్రేమించాడు. అయితే ఆమె ఇంట్లోని వారు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో వెంకట్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంకట్ నటించిన కన్నడ సినిమా పోకిరి.. అట్టర్‌ప్లాప్ కావడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని సన్నిహితులు ఆరోపిస్తున్నారు.