హైదరాబాద్‌లో డిప్యూటీ తహసీల్దార్ల కొరత
19-06-2017 06:08:48
  • రెవెన్యూ శాఖలో 33 పోస్టులు ఖాళీ
  •  కీలక పనుల్లో జాప్యం
  •  నత్తనడకన కోర్టు కేసుల పురోగతి
హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ తహసీల్దార్ల కొరత ఉంది. సుమారు 33 మంది డిప్యూటీ తహసీల్దార్ల పో స్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రధానమైన పనుల్లో పురోగతి కనిపించడం లేదు. మండల కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్ల సేవలు ఎంతో ముఖ్యం. క్షేత్ర స్థాయిలో సిబ్బందితో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. కోర్టు కేసుల్లో కౌంటర్‌ దాఖలు చేయడంలో వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. జీపీఏ అందుబాటులో ఉన్న సమయంలో ప్రధానమైన కేసుల గురించి డిప్యూటీ తహసీల్దార్లు వివరిస్తారు. అ యితే కొంతకాలంగా హైదరాబాద్‌ రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో పనుల్లో జాప్యం ఏర్పడుతోంది. కోట్ల విలువ చేసే భూ ములకు సంబంధించి కోర్టులో కౌంటర్‌ వేయడంలో రెవెన్యూ సిబ్బంది విఫలమవుతున్నారు.
 
నత్తనడకన కీలక పనులు
మండల కార్యాలయాలకు రోజూ వందలాది మంది తమ సమస్యలపై వస్తుంటారు. తహసీల్దార్లు ఉన్నతాధికారులతో సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఫిర్యాదులపై డిప్యూటీ తహసీల్దార్లు స్పందించాల్సి ఉంటుంది. అయితే మారేడుపల్లి, నాంప ల్లి, అమీర్‌పేట, సైదాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర మం డలాలతో పాటు, కలెక్టరేట్‌లో కూడా డిప్యూటీ తహసీల్దార్ల కొరత ఉంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, అర్హులను తేల్చడంలో జాప్యం జరుగుతోంది.
 
ఇటీవల పదోన్నతులపై 16 మంది డీటీలు
ఇటీవల 16 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. అందులో కొందరిని యూఎల్‌సీకి, మరికొందరిని కలెక్టరేట్‌కు కేటాయించారు. ఇంకొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. దీంతో మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్ల కొరత ఏర్పడింది. ఈ పోస్టుల ఖాళీగా ఉండటంతో పని ఒత్తి డి సీనియర్‌ అసిస్టెంట్లపై ఎక్కువగా ఉంటుంది. సీనియర్‌ అసిస్టెంట్లకు డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే మెయింటనెన్స్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. అయితే అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు.