ఈ బ్రాండ్ పేరుతో వచ్చే వెల్లుల్లి పేస్ట్‌ కల్తీనే
19-06-2017 06:03:51
 • నగరంలో కల్తీ వెల్లుల్లి పేస్ట్‌... 
 • పాతబస్తీ కేంద్రంగా తయారీ..
 •  జంటనగరాల్లో కిలో 50 చొప్పున అమ్మకం
 •  తనిఖీలలో 450 కిలోల పేస్ట్‌ స్వాధీనం

హైదరాబాద్‌సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వంటకాలకు వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కల్తీరాయుళ్ల చర్యలతో ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. రకరకాల బ్రాండ్లతో, డబ్బాలలో వస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఎంతవరకు మంచిదనే సందేహాలను రేకెత్తిస్తోంది. నగరంలో కల్తీ రాయుళ్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు ఉధృతం చేశారు. ఈ దాడుల్లో ఆహార పదా ర్థాల కల్తీ కేసులే ఎక్కువని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఆహార ఉత్పత్తుల్లో మోతాదు మించి ఉపయోగిస్తున్న ట్టు పలు చోట్ల పట్టుబడిన పదార్థాల్లో వెలుగుచూసిం ది. నగరంలో పలు బ్రాండ్ల పేరుతో వస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో 80-90 శాతం కల్తీవేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం పాతబస్తీలోని అఫ్జల్‌సాగర్‌ ప్రాంతంలో అనుమతిలేకుండా అల్లంవెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తున్న నివాసంపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఇంట్లో అబ్దుల్‌ మాజిద్‌(34) అనే వ్యక్తి అనుమతుల్లేకున్నా పేస్ట్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
 
               షాలిమార్‌, ఫ్యామస్‌ బ్రాండ్స్‌ పేరిట లేబుల్స్‌ తయారుచేసి విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. తయారీ ప్రక్రియలో పాడైన, పనికిరాని సరుకులను, టైటానియమ్‌ వైట్‌ కెమికల్‌ పౌడర్‌, లెమన్‌ ఎల్లో సింథటిక్‌ కలర్స్‌ వాడుతున్నట్టు తేల్చారు. రోజూ పెద్ద మొత్తంలో సరుకు తయారుచేస్తూ కిలో.50, ఐదు కిలోలు 200 చొప్పున రిటైల్‌ వ్యాపారులకు విక్ర యిస్తున్నాడు. అక్కడ డిమాండ్‌ను బట్టి రిటైల్‌ వ్యాపా రులు అమ్మకాలు సాగిస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. నిందితుడి గోదాంనుంచి 450 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌, వివిధ రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. వెస్ట్‌జోన్‌ ఇన్‌ స్పెక్టర్‌ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు ప్రభాకర్‌రెడ్డి, కిషోర్‌, భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
 
 
 1. కూకట్‌పల్లిలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ మేనేజర్‌ ఆత్మహత్య
 2. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
 3. సినిమా కోసం బండ బూతులు నేర్చుకున్న చిన్నది
 4. పాండురంగారావు భార్యపై పేరిట బోగస్ కంపెనీల రిజిస్టర్: ఏసీబీ
 5. చిన్నారి మీనాను బయటకు ఎలా తీయాలో ఐడియా ఇచ్చిన ఓ విద్యార్థి
 6. టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం..
 7. 6 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌
 8. గద్దర్ నూరేళ్లు బతకాలంటూ పోలీసుల పోస్టర్లు
 9. ఒక్కొక్కరూ ఆరు ఫీట్లు ఉన్నారు.. అయినా ఏం లాభం: కేటీఆర్
 10. రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌పై అసదుద్దీన్‌ విమర్శలు