ఈ మోడల్ సాహసాన్ని చూసే దమ్ముందా?
17-02-2017 16:40:31
దుబాయ్ :  రికార్డులు బద్దలుగొట్టాలంటే దమ్ముండాలి. రోషమున్నోడే సాహసాలు చేయగలడు, విజయాలను సొంతం చేసుకోగలడు.
 
కానీ కొందరు చేసే సాహసాలను చూసేవాళ్ళకి కూడా ధైర్యం ఉండాలి. గుండె దిట్టంగా ఉన్నోళ్ళే అలాంటి సాహసాలను చూడగలుగుతారు.
 
ఒళ్ళు గగుర్పొడిచే సాహసాన్ని చేసి చూపించింది ఓ రష్యా మోడల్. ఫొటో షూట్ కోసం ఆమె ఆకాశ హర్మ్యం నుంచి వేలాడింది. ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. లక్షలాది మంది ఆ వీడియోను చూస్తున్నారు. కొందరు ఆమెను తిట్టిపోశారు. ప్రాణాలతో చెలగాటాడతావెందుకని నిలదీశారు. మరికొందరు ప్రశంసించారు.
 
రష్యన్ మోడల్ వికీ ఒడింట్కోవాకి సాహసాలంటే చాలా ఇష్టం. ప్రపంచం దద్దరిల్లేలా ఏదో ఒకటి చేస్తేగానీ మనసుండబట్టదు. అందుకే ఆకాశ హర్మాల నగరం దుబాయ్‌కి వెళ్ళింది. ఆమె వయసు 22 ఏళ్ళే. కానీ బుర్ర నిండా సృజనాత్మక ఆలోచనలే, గుండె నిండా ధైర్యమే.
 
 
సుమారు 70 అంతస్థుల ఎత్తు నుంచి వేలాడుతూ పొటో తీసుకోవాలనుకుంది. వెంటనే తాను పని చేసే యాడ్ ఏజెన్సీ మవ్రీన్ స్టూడియోస్ లైవ్ బృందంతో కలిసి ఓ బహుళ అంతస్థుల సౌధం మెట్లు ఎక్కేసింది. ఓ స్టంట్ మ్యాన్ సహాయంతో తాను అనుకున్నది చేసి చూపించింది. ఆమె చేతిని పట్టుకుని ఆ స్టంట్ మ్యాన్ గోడపై నిల్చున్నాడు. ఆమె నెమ్మదిగా బయటకు వేలాడింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
 
ఆరు నిమిషాల నిడివిగల ఈ వీడియోను యూట్యూబ్‌లో సుమారు 8 లక్షల మంది చూశారు. అత్యధికులు ఆమెను, ఆ మీడియా సంస్థను తిట్టిపోశారు. యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
 
దీంతో ఆమె మరో వీడియోను పోస్ట్ చేసింది. దాని మీద ‘‘ఈ స్టంట్స్ అన్నిటినీ నిపుణులు చేశారు, మీ అంతట మీరు వీటిని చేసే ప్రయత్నం చేయకండి’’ అనే సందేశాన్ని ఉంచింది.
  1. హనీప్రీత్, గుర్మీత్ శృంగారంలో ఉండగా నేను చూశా: హనీప్రీత్ మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు
  2. సన్నీ యాడ్‌పై 'ఆరెస్సెస్' డాక్టర్ల వ్యతిరేకత
  3. 78 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేశాడు...!
  4. ‘బ్లూవేల్’ బాధను ఆన్సర్ షీట్‌పై రాసిన పదో తరగతి విద్యార్థి
  5. బాయ్ ఫ్రెండ్‌తో పందెం కట్టి ఏం చేసిందంటే...
  6. ఈ మైదానం... హ్యాట్రిక్‌ల స్వర్గం..!
  7. రైల్లో అతడు చేస్తున్నది చూసి జనాలంతా పరుగో పరుగు!
  8. డేరాబాబా స్వగ్రామంలోని ఇంట్లో హనీప్రీత్? పోలీసుల ఆకస్మిక సోదాలు
  9. లేడీ డాక్టర్ దగ్గరకు గర్భిణి వెళితే ఆ డాక్టర్ భర్త చేసిన నీచమిది
  10. ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది...