చిరు హోస్టింగ్‌పై ఉపాసన ఏమందంటే...
సికింద్రాబాద్‌లో భారీగా పాత కరెన్సీ పట్టివేత     |     భూసేకరణ సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం     |     కరీంనగర్‌: కొండాపూర్‌లో ప్రభాకర్‌ అనే వ్యక్తి ఇంటిఆవరణలో సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విగ్రహం ఏర్పాటు      |     గత సభలో సస్పెండైతే ఇప్పుడు సభకు రాకూడదని ఏ చట్టంలో ఉందో సీఎం, స్పీకర్ చెప్పాలి: బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి     |     భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం     |     సిద్దిపేట‌: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోదరుడు రామచంద్రం అరెస్ట్, మావోయిస్టులతో సంబంధాలున్నట్లు అనుమానం     |     పక్షుల దాహార్తి తీర్చేందుకు చిన్నారులు నీటి కుండలు ఏర్పాటు చేయాలి: మన్ కీ బాత్‌లో మోదీ     |     తూ.గో: అమలాపురంలో దుండగుల దుశ్చర్య, 10 కార్లను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు     |     తూ.గో. అమలాపురంలో ఆక్వా మొబైల్ లాబ్‌ను ప్రారంభించిన ఎంపీ రవీంద్రబాబు     |     ఖమ్మం: మిర్చి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం     
చిరు హోస్టింగ్‌పై ఉపాసన ఏమందంటే...
17-02-2017 15:22:11
హిందీలో సూపర్‌హిట్‌ అయిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నిర్వహిస్తున్నారు. 2014 జూన్ 9న ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది. అప్పట్నుంచి మూడు సీజన్ల వరకు అక్కినేని నాగార్జున కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు. తాజా సీజన్‌కు చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న చిరంజీవి బుల్లితెరపై అడుగిడి అనూహ్య స్పందనను సొంతం చేసుకున్నాడు. అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు చిరంజీవి హోస్టింగ్‌ను బాగా ఎంజాయ్ చేశారు. వారి సంగతి పక్కనపెడితే.. చిరు కుటుంబ సభ్యులు చిరు యాంకరింగ్‌పై ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా చిరు కోడలు ఉపాసన ఏమంటోంది?... ఆమె మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో చిరంజీవి యాంకరింగ్‌పై స్పందించింది. చిరుపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. ‘‘ఇప్పుడే చానళ్లు మారుస్తూ నేనేం చూశానో తెలుసా? మామయ్య చిరంజీవి హోస్ట్ చేస్తున్న తెలుగు వర్షన్ కౌన్ బనేగా కరోడ్ పతిని చూశాను. ఆ కార్యక్రమాన్ని చూస్తూ అలా టీవీకి అతుక్కుపోయాను’’ అంటూ కార్యక్రమం అయిపోయిన కాసేపటికే ట్వీట్ చేసింది. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి సంబంధించి చిరంజీవి ఫొటోలను ట్వీట్ చేసింది ఉపాసన.