రామాయణం
16-02-2017 23:02:42
‘శ్రీరామ చరితం రామాయణం.. సీతమ్మ హృదయం రామాయణం..’ అన్నారు పెద్దలు. అందుకే రామాయణం నిత్య పారాయణం అయింది. యుగాలు గడిచినా తరగని సంపదగా నిలిచిపోయింది. ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నవారికి రామాయణం ఒక పవిత్ర గ్రంథం. మామూలు మనుషులకు రామాయణం ఒక జీవిత గ్రంథం. అది చదివితే.. మంచితనం అంటే ఏంటో తెలుస్తుంది. తండ్రితో ఎలా మాట్లాడాలో, అన్నదమ్ములతో ఎలా మెలగాలో, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తాయి.అందుకే రామచరిత ను ఎందరో కవులు.. తమ రచనల ద్వారా కొత్తగా ఆవిష్కరించారు. రచయిత ఎ.ఎన్‌.జగన్నాథశర్మ రామాయణాన్ని ఆబాలగోపాలానికి సరికొత్తగా పరిచయం చేశారు. రామకథ అవలీలగా అర్థమయ్యేలా సరళ వ్యావహారిక భాషలో ‘రామాయణం’ గ్రంథ రూపంలో అందించారు. 

ప్రతులు: 512, వెల: రూ.500
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌ హౌస్‌,
నవచేతన బుక్‌హౌస్‌
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి - పి. శివరాం
For internet advertisement and sales please contact - Mr. P. Sivaram
+91 99859 21400
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.