పంచేంద్రియాలకు అతీతమైన అనుభవం
సికింద్రాబాద్‌లో భారీగా పాత కరెన్సీ పట్టివేత     |     భూసేకరణ సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం     |     కరీంనగర్‌: కొండాపూర్‌లో ప్రభాకర్‌ అనే వ్యక్తి ఇంటిఆవరణలో సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విగ్రహం ఏర్పాటు      |     గత సభలో సస్పెండైతే ఇప్పుడు సభకు రాకూడదని ఏ చట్టంలో ఉందో సీఎం, స్పీకర్ చెప్పాలి: బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి     |     భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం     |     సిద్దిపేట‌: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోదరుడు రామచంద్రం అరెస్ట్, మావోయిస్టులతో సంబంధాలున్నట్లు అనుమానం     |     పక్షుల దాహార్తి తీర్చేందుకు చిన్నారులు నీటి కుండలు ఏర్పాటు చేయాలి: మన్ కీ బాత్‌లో మోదీ     |     తూ.గో: అమలాపురంలో దుండగుల దుశ్చర్య, 10 కార్లను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు     |     తూ.గో. అమలాపురంలో ఆక్వా మొబైల్ లాబ్‌ను ప్రారంభించిన ఎంపీ రవీంద్రబాబు     |     ఖమ్మం: మిర్చి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం     
పంచేంద్రియాలకు అతీతమైన అనుభవం
16-02-2017 23:00:24
మనుగడకు అతీతంగా ఉన్న దానిని మీరు కాంక్షిస్తే, దానికి కేవలం ఇంద్రియ జ్ఞానమే సరిపోదు. ఒక్క ప్రకృతిని తప్ప, మీకు మించిన శక్తిని దేనినీ మీరు ఇప్పటి వరకు అనుభూతి చెందలేదు. ఇప్పుడిక్కడ గాలి వీస్తోంది, ఈ గాలిని మీరు ఊదటం లేదు. అంతవరకూ మీకు తెలుసు, అవునా? గాలి వీస్తోంది. కాని అది మీరు చేస్తున్నది కాదు. అలాగే మిమ్మల్ని మీరు సృజించుకోలేదు, మీరు ఇక్కడ ఉన్నారు అంతే. మీకు అతీతంగా ఉన్న ఏదో శక్తి వల్ల ఇదంతా జరుగుతోంది. ఆ శక్తే లేకపోతే ఏమీ జరగదు. బహుశా మిమ్మల్ని కూడా ఆ శక్తే సృష్టించి ఉండాలి.
 
ఇప్పుడు మిమ్మల్ని సృష్టించింది ఎవరో మీకు తెలియదు కాబట్టి, వెంటనే ఆ భగవంతుడే మీకు ప్రాణం పోసి ఉంటాడు.. అని మీరు భావిస్తున్నారు. అవునా? మరి, ఈ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు మానవులు కాబట్టి, మీ ఊహలో భగవంతుడు మీకంటే చాలా పెద్ద మానవుడు. మీరే ఒక గేదె అయి ఉంటే.. భగవంతుడు కూడా ఇంకొక పెద్ద గేదె అనుకునేవారు. అంటే, ప్రస్తుతం మీరెవరో, ఏ స్థాయిలో ఉన్నారో, దానిని బట్టి మీకు కలిగే పరిమితానుభవం ద్వారా, భగవంతుని గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతోంది. అంతే కానీ నిజమైన, వాస్తవిక అనుభవం మీకు లేదు. భగవంతుని గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతోంది. అంతేకాని నిజమైన, వాస్తవిక అనుభవం మీకు లేదు. భగవంతునిపై మీకున్న అభిప్రాయం కేవలం మీ పరిమితమైన మీరు మానవరూపంలో ఉన్నారు కాబట్టి, భగవంతుడు ఒక పెద్ద మానవస్వరూపం అని మీరు అనుకుంటున్నారు.
 
అంటే.. భగవంతుడనీ, శక్తి అనీ, మీరు పిలుస్తున్నదంతా కేవలం మీ ఊహలు, ఆలోచనలు మాత్రమే. భగవంతుడిపై మీకున్న తలంపులన్నీ మీ మెదడులో ఉద్భవించిన ఆలోచనలు మాత్రమే. అంతా మీ మెదడులోనే ఉన్నది, అవునా? వాస్తవానికి మీ లోపల, మీ ఆంతర్యంలో నిక్షిప్తమై ఉన్నదానిని మాత్రమే మీరు అనుభూతి పూర్వకంగా గ్రహించగలరు. కాని మీరు ఇప్పటి వరకూ మీ అంతరాలను తరచి చూడనే లేదు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నదీ, అనుభవపూర్వకంగా గ్రహించిందీ, అంతా పంచేంద్రియాల ద్వారా మాత్రమే మీ గురించి కానీ, ప్రపంచం గురించి కానీ మీరు తెలుసుకున్నదంతా చూడటం, వినడం, రుచి, వాసన, స్పర్శ - ఇలా ఈ ఐదింటి ద్వారా మాత్రమే పంచేంద్రియాలన్నీ నిద్రలోకి వెళ్లిపోతే, ఇక ఈ ప్రపంచం గురించి కాదు కదా.. కనీసం మీ గురించి కూడా మీకు తెలియదు.
 
ఈ ఇంద్రియాల సామర్థ్యం చాలా పరిమితం. ఇంద్రియాలు అన్నింటినీ వేరొక దానితో పోల్చడం ద్వారా మాత్రమే గుర్తిస్తాయి. ఉదాహరణకు నేను ఈ ఇనుపకడ్డీని తాకాననుకోండి. అది నాకు చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే నా శరీర ఉష్ణోగ్రత ఇనుపకడ్డీ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంది కాబట్టి, అదే నేను నా శరీర ఉష్ణోగ్రతను బాగా తగ్గించుకుని ఇనుపకడ్డీని తాకాననుకోండి. అది నాకు వేడిగా అనిపిస్తుంది. అంటే.. ఇది వాస్తవమైన, యధార్థమైన అనుభవం కాదు. కాని మనుగడ కోసం ఈ అనుభవం సరిపోతుంది. పంచేంద్రియాల ద్వారా మీరు పొందే అనుభూతి, జ్ఞానం ఈ భూమి మీద మనుగడకు మాత్రమే సరిపోతుంది.
 
కాని, మీరు మనుగడకు అతీతంగా ఉన్న దానిని ఆకాంక్షించినప్పుడు ఇంద్రియజ్ఞానం సరిపోదు. అందుకే యోగసాధనాల ప్రాథమిక లక్ష్యం, ఈ పంచేంద్రియాలకు అతీతమైన అనుభవాన్ని ఇవ్వడమే. ఈ పంచేంద్రియాలకు అతీతంగా, మీరు ఏ అనుభవం పొందినా అది భౌతిక పరిధిలోనిది కాదు. మరో విభిన్న పరిధిలోనిది. దానిని మీరు భగవంతుడని పిలవాలనుకుంటే.. అలానే పిలవండి. లేదా శక్తి అని పిలవాలనుకుంటే.. శక్తి అనే పిలవండి. ఆత్మ అని పిలవాలనుకుంటే ఆత్మ అనే పిలవండి. మీరు ఎలా నచ్చితే అలా పిలవండి. మీరు ఏ పేరుతో పిలిచినా సరే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దానికి ఒక పేరు పెట్టిన మరుక్షణం, మనుషులు దానిని అపార్థం చేసుకుంటారు.ఎప్పుడూ అంతే! ‘శివుడు’, ‘అల్లా’, ‘దైవం’, లేదా ‘దివ్యత్వం’ అని ఇలా మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు. కానీ ఒక పేరు ఉచ్చరించిన మరుక్షణం, మనుషుల్లో అపార్థాలు పుట్టుకొస్తాయి. మరి, ఇలాంటి పరిమితులన్నింటినీ దాటి పోవాలనే ఆకాంక్ష మీలోనే కలుగుతోందా? లేక బయటి నుంచి వస్తోందా? ఇదే ప్రశ్న. ఈ పరిమితులన్నీ దాటి సర్వోన్నతమైన లక్ష్యాన్ని పొందాలనే బలమైన కోరిక మీలో మనస్ఫూర్తిగా కలిగితేనే ఇది సాధ్యం అవుతుంది. లేకపోతే ఈ భూమ్యాకాశాలలోని ఏ శక్తీ మిమ్మల్ని కదిలించలేదు.

  • సద్గురు