ఫీల్‌ సేఫ్‌
09-08-2016 22:39:18
మహిళల భద్రత కోసం ఎన్నో యాప్‌లు వచ్చాయి. తాజాగా మొబైల్‌ స్టాండర్డ్‌ అలయన్స్‌ ఆఫ్‌ ఇండియా, నిర్భయ జ్యోతి ట్రస్ట్‌ సంయుక్తంగా సరికొత్త యాప్‌ని తీసుకొచ్చాయి. ఈ యాప్‌ పేరు ‘ఐ ఫీల్‌ సేఫ్‌’. ఇది ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు పవర్‌బటన్‌ని లాంగ్‌ప్రెస్‌ చేస్తే చాలు.. ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నట్టు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లకు సమాచారం అందుతుంది. బంధువులు, స్నేహితులకు కూడా అలర్ట్స్‌ వెళ్లిపోతాయి. బాధితులు పరిగెత్తుతున్నారా, ఒకేచోట ఉండిపోయారా అని తెలుసుకోవచ్చు. జీపీఎస్‌ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకోవచ్చు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.