చింతపండు రసం తాగితే..  ఎన్ని లాభాలో తెలుసా?

వేసవిలో మన శరీరం డీహైడ్రేడ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే.. చింతపండు నీరు తాగాలి.

చింతపండులోని విటమిన్స్, థయామిన్, రైబోఫ్లేవిన్.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి.

చింతపండు రసంలోని విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

చింతపండు నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది తాగితే.. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.

చింతపండు నీటిలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. గౌట్ వంటి సమస్యల్ని దూరం చేసి.. మంట, నొప్పులు తగ్గిస్తాయి.

చింతపండు రసంతో తాగితే.. జీర్ణ ఎంజైమ్స్ ఉత్తేజితమై, జీర్ణ సమస్యలు దూరమై, జీర్ణక్రియ మెరుగవుతుంది.

వేసవిలో చింతపండు నీరు తరచుగా తాగితే.. బాడీ చల్లగా ఉంటుంది. వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

చింతపండు నీరులో పీచు పదార్థం ఉంటుంది. దీంతో.. ఎక్కువగా తినలేరు. ఫలితంగా.. బరువు తగ్గుతారు.

చింతపండు రసంలో ఉండే వివిధ రకాల పోషకాలు.. కంటి వ్యాధులు, దృష్టి లోపాలను మెరుగుపరుస్తాయి.

చింతపండు రసం మరీ ఎక్కువగా తాగితే వీరేచనాలు అవుతాయి. కాబట్టి.. తక్కువ మొత్తంలో తీసుకోవాలి.