వేసవిలో రకరకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే మేలు రకమైన 5 మామిడి పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆల్ఫోన్సో రకాలను మామిడి పండ్లలోనే రాజుగా పిలుస్తుంటారు. ఇవి రుచితో పాటూ రోగ నిరోధక శక్తిని పెంపొందిచడంలోనూ సాయపడతాయి. 

లాంగ్రా మామిడి పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటూ పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

దస్‌హేరి మామిడి పండ్లలోని విటమిన్-ఏ తదితర పోషకాలు మెరుగైన కంటి చూపుతో పాటూ చర్మానికీ మేలు చేస్తాయి. 

కేసర్ మామిడి పండ్లలోని విటమిన్-సి, యాంటి ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

తోతాపురి మామిడి పండ్లలోని విటమిన్ -ఏ, విటమిన్ -సి.. రోగనిరోధక శక్తిని పెంపొందిచడంలో సాయపడతాయి.