ఫోన్ ట్యాపింగ్‌పై తమిళి సై సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఆమె మాట్లాడుతూ..

గవర్నర్‌గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్‌ చేశారు. 2022లోనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పా. నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించింది.

ప్రస్తుత దర్యాప్తుతో ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో నేను చెప్పింది నిజమేనని స్పష్టం అయింది. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంపిక చేసిన పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లక్ష్యంగా చేసుకున్న ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును విచారించాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కీలక నిందితులు పరారీలో ఉన్నారని దర్యాప్తు అధికారులు ఇటీవల వెల్లడించారు. 

నేపథ్యంలో మాజీ గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆమెకు తగిన ప్రోటోకాల్‌ పాటించని విషయం తెలిసిందే.