పరగడుపునే ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది!

శరీరంలోని చెడు కొలస్ట్రాల్ వల్ల ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తాయి. పరగడుపునే కొన్ని ఆహార పదార్థాలు తింటే కొలస్ట్రాల్ సమస్య నియంత్రణలో ఉంటుంది.

నీటిలో కరిగే ఫైబర్‌ను పుష్కలంగా కలిగి ఉండే ఓట్స్‌ను పరగడుపునే తీసుకుంటే మంచిది. కొవ్వులను కరిగించడంలో ఓట్స్ క్రీయాశీలకంగా పని చేస్తాయి. 

ఆల్ఫా-లినోలిక్ యాసిడ్ అనేది ఒక రకమైన ఒమైగా 3 ఫ్యాటీ ఆమ్లం. ఇది అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఇవి LDL (చెడు) కొలస్ట్రాల్‌ను తగ్గించి, HDL (మంచి) కొలస్ట్రాల్‌ను పెంచుతాయి. 

విటమిన్-సి, పెక్టిన్‌ను అధిక మొత్తంలో కలిగి ఉండే సిట్రస్ ఫలాలు కొవ్వు శోషణను తగ్గిస్తాయి. కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. 

పెక్టిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండే ఆపిల్స్ శరీరంలోని LDL (చెడు) కొలస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. 

కరిగే ఫైబర్, మొక్కల ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉండే ఆహార పదార్థం చిక్కుళ్లు. రకరకాల చికుళ్ల గింజలు కొలస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. 

మోనో అన్-శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉండే అవకాడో HDL (మంచి) కొలస్ట్రాల్‌ను పెంచి, LDL (చెడు) కొలస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. 

గుండె జబ్బులను కలిగించే LDL (చెడు) కొలస్ట్రాల్‌ను తగ్గించగలిగే యాంటీ-ఆక్సిడెంట్లు బెర్రీస్‌లో పుష్కలంగా ఉంటాయి. 

కాటెచిన్స్ అని పిలిచే యాంటీ-ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని LDL (చెడు) కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.