Share News

బజ్‌రంగ్‌పై తాత్కాలిక నిషేధం

ABN , Publish Date - May 06 , 2024 | 05:16 AM

ఇటీవలే జరిగిన ట్రయల్స్‌ సందర్భంగా డోప్‌ టెస్ట్‌ కోసం శాంపిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాపై తాత్కాలిక నిషేధం విధించారు...

బజ్‌రంగ్‌పై తాత్కాలిక నిషేధం

న్యూఢిల్లీ: ఇటీవలే జరిగిన ట్రయల్స్‌ సందర్భంగా డోప్‌ టెస్ట్‌ కోసం శాంపిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాపై తాత్కాలిక నిషేధం విధించారు. మార్చి 10న సోనెపట్‌లో ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో ఓటమిపాలైన బజ్‌రంగ్‌ శాంపిల్‌ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. కాగా తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దాకా బజ్‌రంగ్‌ ఏ ట్రయల్స్‌లోనూ పాల్గొనలేడు. ఇది అతని ఒలింపిక్‌ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. అయితే శాంపిల్‌ ఇచ్చేందుకు తాను నిరాకరించలేదని బజ్‌రంగ్‌ చెప్పాడు.

Updated Date - May 06 , 2024 | 05:16 AM