Share News

టెక్‌ వ్యూ : ప్రధాన నిరోధాలు 22,650, 22,800

ABN , Publish Date - May 06 , 2024 | 06:09 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలో ప్రారంభమై 22,800 వరకు వెళ్లినా గత శుక్రవారంనాడు బలమైన కరెక్షన్‌కు లోనై 200 పాయింట్ల మేరకు నష్టపోయి. వారం మొత్తం మీద 55 పాయింట్ల మేరకు..

టెక్‌ వ్యూ  : ప్రధాన నిరోధాలు 22,650, 22,800

టెక్‌ వ్యూ : ప్రధాన నిరోధాలు 22,650, 22,800

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలో ప్రారంభమై 22,800 వరకు వెళ్లినా గత శుక్రవారంనాడు బలమైన కరెక్షన్‌కు లోనై 200 పాయింట్ల మేరకు నష్టపోయి. వారం మొత్తం మీద 55 పాయింట్ల మేర కు లాభపడినా 22,500 కన్నా దిగువన వారం కనిష్ఠ స్థాయిలో ముగియడం గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తతకు సంకేతం. టెక్నికల్‌గా మార్కెట్‌ గత కొద్ది వారాలుగా చూస్తున్న సైడ్‌వేస్‌ ట్రెండ్‌ను కొనసాగించింది. గత రెండు నెలలుగా గరిష్ఠ స్థాయిల్లో సరైన కొనుగోళ్ల మద్దతు లేని కారణంగా నిలదొక్కుకోలేకపోతుంది. అదే సమయంలో దిగువ స్థాయిల్లో లభిస్తున్న కొనుగోళ్ల మద్దతు కారణఱంగా కనిష్ఠ స్థాయిల్లో రికవరీ కూడా సాధిస్తోంది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉంది. కాగా గతవారం మిడ్‌క్యాప్‌ 100 సూచీ 310 పాయింట్లు లాభపడగా, స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 45 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌ మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరువగా వస్తోంది. పలుమార్లు ఇక్కడ ఎదుర్కొన్న పరీక్షల్లో విఫలమవుతూ వస్తోంది. ఈ వారంలో మార్కెట్‌ పాజిటివ్‌గానే ప్రారంభమై జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో పరీక్ష ఎదుర్కొనవచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ పాజిటివ్‌ ధోరణిలో ట్రేడయితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 22,650 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 22,800. గత నెల 10వ తేదీన ఈ స్థాయి నుంచే మార్కెట్‌ బలమైన రియాక్షన్‌ సాధించింది. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. మానసిక అవధి 23,000.

బేరిష్‌ స్థాయిలు: ప్రస్తుత స్థాయి 22,500 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే దిగువన 22,300 వద్ద మద్దతు ఉంది. అక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 22,000.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారంలో బలమైన ర్యాలీ సాధించి మానసిక అవధి 50,000 వరకు వెళ్లింది. అక్కడ మైనర్‌ కరెక్షన్‌లో పడి వారం గరిష్ఠ స్థాయి కన్నా 10,000 పాయింట్లు దిగజారిది. అయినా వారంలో చివరికి 720 పాయింట్ల లాభంతో 48,920 వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 49,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 50,000. ఒక వేళ 49,000 స్థాయిలో విఫలమైతే బలహీనతను సూచిస్తుంది. మద్దతు స్థాయి 48,600.

పాటర్న్‌: వీక్లీ చార్టుల ప్రకారం 22,800 వద్ద ‘‘డబుల్‌ టాప్‌’’ పాటర్న్‌ ఏర్పడింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం దీన్ని బ్రేక్‌ చేయాలి. అలాగే ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌ ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 22,610, 22,650

మద్దతు : 22,500, 22,430

వి. సుందర్‌ రాజా

Updated Date - May 06 , 2024 | 06:10 AM